తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీయుతులు ధర్మారెడ్డి మార్గదర్శనoలో శ్రీ వెంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయoలో తాళపత్ర పరిరక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం నేటివరకు ఎందరో దాతలు వద్ద నుండి తాళపత్రగ్రంథాలను సమీకరిస్తూ వాటిని సంరక్షిస్తూ, పరిశోధన చేసి ప్రకాశనం చేస్తున్నది. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వరవేదవిశ్వవిద్యాలయం 2108 అపూర్వ గ్రంథాలను కలిగి భావితరాలవారికోసం డిజిటైజ్ చేసి సంరక్షిస్తోంది. ఇటువంటి మహత్తరమైన, అరుదైన కృషిని సల్పుతున్న ఈ తాళపత్రగ్రంథాలయo సేకరణ, సంరక్షణ, పరిశోధన, డిజిటైజేషన్ మరియు ప్రకాశనం అనే లక్ష్యదిశగా నడుస్తోంది.. ఈ విభాగ గౌరవo మరియు ప్రకాశన సేవలను గుర్తించిన అనేక విశ్వవిద్యాలయాలు, పరశోధన సంస్థలు వేదవిశ్వవిద్యాలయoతో MoU చేసుకొని తాళపత్ర గ్రంథ సంరక్షణలో జ్ఞానరక్షణ చేస్తూన్నారు. ఇటీవల సి.పి.బ్రౌన్ భాషాపరిశోధనకేంద్రం, యోగివేమన విశ్వవిద్యాలయము, కడప వారు శ్రీవేంకటేశ్వరవేదవిశ్వవిద్యాలయముతో 10-10-2023వ తేదిన MoU చేసుకుని 173 బండిల్స్ లో గల 288 తాళపత్రగ్రంథములను అందచేశారు*. వాటిని విశ్వవిద్యాలయం వివిధ దశలలో రక్షణచర్యలు చేపట్టి, డిజిటైజ్ చేసి విజయవంతముగా పూర్తిచేసిన పిదప ఇటీవల డా .చింతకుంట శివారెడ్డి1. డిజిటైజ్డ్ ప్రతులతో 63 జీ.బి పరిమాణం గల డేటాను పెన్డ్రైవ్ లో ను, 2. ఆ గ్రంథముల క్యాటలాగును, 3. గ్రంథములను అందచేసినట్లు ఒప్పందపత్రమును, 4. కేంద్రమువారు డిజిటలైజేషన్ నిమిత్తము ఇచ్చిన 173 బండిల్స్ ను కులపతులు ఆచార్య రాణిసదాశివమూర్తిగారు తిరిగి అందచేశారు. 5. ఈ సందర్భంగా *డా. చింతకుంట శివారెడ్డి(రీసెర్చ్ అసిస్టెంట్, సి.పి.బ్రౌన్ భాషాపరిశోధనకేంద్రం, యోగివేమన విశ్వవిద్యాలయము, కడప*) మాట్లాడుతూ *ఒప్పందం ప్రకారం తాము ఇచ్చిన తమ గ్రంథాలకు ఉచితంగా క్లీనింగ్, ఆయిలింగ్, ఇంకింగ్ జరిగాయని అన్నివివరాలతో కూడిన కాటలాగ్తో పాటు జాగ్రత్తగా డిజిటైజేషన్ ప్రక్రియ ద్వారా డిజిటల్ గా భద్రపరచి పెన్ డ్రైవ్ లో ఉచితం గా అందచేశారని తెలియచేశారు.* *శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ స్వచ్ఛంద సేవకి సంతోషించి ప్రత్యేక శ్రద్ధతో ఈ జ్ఞానరక్షణ యజ్ఞమును నిర్వహింపచేస్తున్నటువంటి కులపతులు ఆచార్య రాణిసదాశివమూర్తిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.*

previous post