కాచిగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైల్లో వచ్చిన కొత్తగూడెంకు చెందిన ఉపేందర్, పుష్ప దంపతుల రెండు లగేజి బ్యాగ్లు కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులను ఆశ్రయించారు. అందులో రూ. 3. 92లక్షల విలువైన 56గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని పిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప బృందం 24గంటల్లోనే నిందితురాలు బాన్సవాడకు చెందిన దాసరి మంజులను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించినట్లు డీఎస్పీ సోమవారం తెలిపారు.

previous post