కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులుకు పోలీసుశాఖ ఉన్నతాధికారులు మంగళవారం చార్జ్ మెమో జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మైదుకూరు నియోజకవర్గం పరిధిలో చాపాడు మండలంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలపై మైదుకూరు డీఎస్పీ టి. వెంకటేశులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో చాపాడు ఎస్ఐపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

previous post
next post