తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు,పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలు నివాళి అర్పించారు.అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కు బయల్దేరారు సీఎం. అక్కడ 20 నిమిషాలపాటు కొనసాగనున్న పోలీసుల పరేడ్ ను వీక్షిస్తారు. ఆ తర్వాత 10గంటల 35 నిమిషాలకు రాష్ట్రగీతాన్ని జాతికి అంకితం చేస్తారు. 10గంటల 43 నిమిషాలకు ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అవార్డుల ఫంక్షన్ ఉంటుంది.

previous post