ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రివర్యులుగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపధ్యంలో విజయవాడ నుండి, ఇతర ప్రదేశాల నుండి గన్నవరం ఫంక్షన్ ప్లేస్ కు పాసులు ఉన్న బస్సులు/కార్లను మాత్రమే అనుమతించడం జరుగుతుందని పోలిస్ కమిషనర్ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పాసులు లేని ఇతర వాహనాలు అనుమతించబడదు. విజయవాడలో 1.ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, 2.అంబేద్కర్ విగ్రహం వద్ద, 3.బస్ స్టాండ్, 4.రైల్వే స్టేషన్, 5.లెనిన్ సెంటర్, 6.పటమట లోని జెడ్.పి.బాయ్స్ హై స్కూల్, 7.అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, 8.జింకానా గ్రౌండ్స్ మరియు 9.విధ్యధరపురం మినీ స్టేడియం ఈ 09 ప్రాంతాల నుండి సి.ఎం. గారి ప్రమాణ స్వీకర కార్యక్రామాన్ని ఎల్.ఈ.డి.స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆయా ప్రదేశాలకు వెళ్లి కార్యక్రమాన్ని వీక్షించవచ్చని తెలియజేశారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమత్రులు, కేంద్ర మంత్రులు, వి.వి.ఐ.పి.లు, వి.ఐ.పి.లు మరియు ప్రముఖులు ఈ రహదారుల గుండా ప్రయాణం చేస్తారు కావున వారికి ట్రాఫిక్ పరంగా మరియు భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన బందోబస్త్ ఏర్పాట్లు చేసామని, ప్రశాంత వాతావరణంలో పాసులు కలిగిన ఆహ్వానితులు సభా స్థలానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసామని తెలిపారు.*విజయవాడ నగరము లోని సాధారణ వాహనములు మళ్ళింపులు:* విజయవాడ నుండి ఏలూరు మరియు విశాఖపట్నం వైపుకు వెళ్ళు కార్లు, ద్విచక్ర వాహనములు, ఆర్.టి.సి. బస్సులు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు బెంజ్ సర్కిలు నుండి కంకిపాడు-పామర్రు-హనుమాన్ జంక్షన్-ఏలూరు వైపుకు పంపబడును. ఓల్డ్ PCR జంక్షన్ ఏలూరు రోడ్ హోటల్ స్వర్ణ పాలెస్ రామవరప్పాడు రింగ్ఇన్నర్ రింగ్ రోడ్ఔటర్ రింగ్ రోడ్డు(ORR) హనుమాన్ జంక్షన్ ఏలూరు వైపుకు వెళ్ళ వలెను. గొల్లపూడి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) గన్నవరం హనుమాన్ జంక్షన్ వైపుకు వెళ్ళ వలెను.

previous post