Tv424x7
Andhrapradesh

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ సీఐ రేవతమ్మ

విశాఖపట్నం యువత లక్ష్యం నెరవేరాలంటే కచ్చితంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని టూ టౌన్ ట్రాఫిక్ సిఐ రేవతమ్మ అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు పాడుచేసుకుని తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చిన వారవుతారన్నారు. జీవీఎంసీ హై స్కూల్ లో కన్నయ్య పేట డ్రగ్స్ దుష్ఫలితాలు మరియు మైనర్ డ్రైవింగ్ చేయకూడదు, హెల్ప్మెంట్ తప్పనిసరిగా ఉండాలి, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలి అనే అంశంపై విద్యార్థులకు అవ గాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్లతో ఆర్థికంగా చితికి పోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. యువత కష్టపడి పైకి రావాలే తప్పా అడ్డదారుల్లో ముందుకు వెళ్లాల సుకోవడం మంచి పరిణామం కాదన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ ఐ లక్ష్మి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అమరావతికి భారీగా నిధులు

TV4-24X7 News

మహిళలకు నెలకు రూ.1500.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.

TV4-24X7 News

పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం.. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టం..! : వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment