ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి..!!* ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయనీ మాటలు అన్నట్లు తెలిసింది.’ *నిజంగా వెళ్లిపోదామనే అనిపించింది.* ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో *సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి,* అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. *అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది.* దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చా. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, *మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి.* సర్వేలు చేయించాం, వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అందువల్లే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం..కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి. వాటిని చూసినపుడు *నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకూ ఇబ్బందిగానే ఉంటుంది.* మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను బయటికొచ్చినట్లే మీరూ ఎన్నికల ఫలితాల న

previous post