ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా హాస్పిటల్ ఉన్న ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని అక్కడికి వెళ్తున్న రోగులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో డాక్టర్లు ఉన్న రోగులను పరిక్షించి మందుల ఇవ్వాల్సిన డాక్టర్లు కేవలం మందుల రాసి పంపిచేస్తున్నారు. ఎవరైనా రోగులు పరిక్షలైన సార్ అంటే..బయట చూపిస్కోమని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ రోగులను సరిగ్గా పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఎముకలు, కీళ్ల డాక్టర్ వీరాంజనేయులు ఒక అడుగు ముందుకు వెళ్లి ఇక్కడ మందులు మాత్రమే రాసిస్తాము. మీరు బయట హాస్పిటల్స్ లకు వెళ్లి చూపిస్కోమని నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చారని అక్కడికి చూపించుకోవడానికి వెళ్లిన ఒక జర్నలిస్టుకే సమాధానం ఇచ్చారు. దీంతో సామాన్యుల పరిస్థితి ఏంటని పలువురు ఆరోపిస్తున్నారు.

previous post