ఊపిరి పీల్చుకున్న కర్నూల్ ప్రజలు…కర్నూలు జిల్లా:-కర్నూలు జిల్లా పచ్చర్లలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. కొన్ని రోజుల క్రితం మెహరున్నీసా అనే మహిళను చిరుత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరిపైనా కూడా దాడి చేసింది. తాజాగా, చిరుత బోనులో చిక్కడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, బోన్ లో చిక్కిన చిరుత, మెహరూన్ పై దాడి చేసిన చిరుత ఒక్కటేనా లేదంటే ఇంకో చిరుత ఏమోనా ఉందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు.

previous post