Tv424x7
Cinima NewsNational

రెబలోడి బాక్సాఫీసు ఊచకోత ప్రభాస్ కి ప్రభాసే పోటీ…*

టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటదో తెలుసా? రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) బాక్సాఫీస్ వార్ కి దిగితే అలాగే ఉంటుంది.ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మూవీ కలెక్షన్ల సునామీ చూస్తుంటే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ‘కల్కి’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎదురే లేదన్నట్టుగా ఉంది.సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో.. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ‘కల్కి’ మూవీ ఆరు రోజుల్లోనే ‘బాహుబలి’ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసింది. ‘బాహుబలి-1′ ఫుల్ రన్ లో రూ.600 కోట్ల గ్రాస్ రాబట్టగా..’కల్కి’ కేవలం ఆరు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించి, టాలీవుడ్ హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో సినిమాగా నిలిచింది. నేడో రేపో రూ.700 కోట్ల క్లబ్ లో కూడా చేరి.. మూడో స్థానంలో ఉన్న ‘సలార్-1’ ని దాటేయడం ఖాయం. ఇక ఆ తరువాతి టార్గెట్ రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, రెండో స్థానంలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ అవుతుంది.దీనిని కూడా దాటేయడం ‘కల్కి’కి పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం ‘కల్కి’ జోరు చూస్తుంటే.. రెండు వారాలు కూడా కాకముందే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. ఇక రెండు వారాల తర్వాత టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి.దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద ఎత్తున క్యూ కడతారు. ఆ దెబ్బకి.. మూడు వారాల్లోనే ‘ఆర్ఆర్ఆర్’ లైఫ్ టైం కలెక్షన్స్ ని ‘కల్కి’ దాటే అవకాశముంది. అదే జరిగితే, తెలుగు సినిమాల పరంగా రూ.1800 కోట్ల గ్రాస్ తో ‘బాహుబలి-2’ టాప్ లో ఉండగా..రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ తో ‘కల్కి’ సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది. ఇక ఇండియన్ సినిమాల పరంగా చూస్తే.. మొదటి రెండు స్థానాల్లో ‘దంగల్’, ‘బాహుబలి-2’ ఉండగా.. ‘కల్కి’ మూడో స్థానంలో నిలుస్తుంది.

Related posts

రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం

TV4-24X7 News

సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..

TV4-24X7 News

సునీతా విలియమ్స్‌ రాక మరింత ఆలస్యం

TV4-24X7 News

Leave a Comment