నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) పరీక్ష నిర్వహించడంలో విఫలమైందని ఎన్నో అవకతవకలతో బాధ్యత రహితంగా పరీక్షలు నిర్వహించడం ఎంతో బాధాకరం అని, నీట్ పరీక్ష లో జరిగిన అవకతవకలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు వదిలి నీట్ పరీక్ష పైన సమగ్రమైన విచారణ జరిపి నిందితులకు చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ రాసిన బాదితులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, NTA లాంటి అసమర్థత సంస్థలను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తూ బంద్ చేయడం జరిగింది. నీట్ లాంటి పేదలకు ఊరట కలిగించే పరీక్షలను ఇలా అవకతకులతో జరపడం ప్రభుత్వాలకు సిగ్గుచేటని అదేవిధంగా అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచుతాం అనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఇప్పుడు తను చేస్తున్న పనులకు సంబంధం లేదని, అలాగే నీట్ పరీక్ష పై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాటైనా మాట్లాడిన పాపను పోలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమగ్ర విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో నిర్వహించుకునే విధంగా జీవోలను పాస్ చేయాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం .ఈ బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎస్ఎఫ్ఐ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూన్నాం. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రమేష్ ,సహాయ కార్యదర్శి సందీప్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ మండల నాయకులు కాశి, అరవింద్, దేవా తదితరులు పాల్గొన్నారు.

previous post