ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు కంపెనీల కు ఇచ్చిన ఇసుక కాంట్రాక్టుల ను రద్దు చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఒప్పందాలను ఉల్లంఘించి ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ పర్యావరణ విధ్వంసానికి పాల్పడటమే కారణాలుగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారులు నోటీసులు ఇస్తారని సమాచారం. కాగా ఈ నెల 8 నుంచి ప్రభుత్వంఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించనున్న విషయంతెలిసిందే. ఇకపై రూ.88కే టన్ను ఇసుక అందనుంది.
