Tv424x7
Andhrapradesh

భారీ కుంభకోణం….కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!

విశాఖలో అవయవ మార్పిడి పేరుతో భారీ మోసం బయటపడింది. అనారోగ్యానికి గురైన తన భార్య కోసం ఆశ్రయించిన వ్యక్తిని నిండా ముంచారు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షలు తీసుకుని మోసగించినట్టు పోలీసులకు పిర్యాదు చేశాడు బాధితుడు.దీంతో మహిళ డాక్టర్ సహా ఆమె సహాయకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది.పురుషోత్త పురం ప్రాంతానికి చెందిన గోపి భార్య శారద అనారోగ్యానికి గురైంది. మెడికల్ టెస్టులు చేయించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో డయాలసిస్ కూడా చేయిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయాల్సి రావడంతో.. కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు. తన బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ కాకపోవడంతో, సీతమ్మధారలోని ఎన్నారై ఆసుపత్రి డాక్టర్ వాణిని సంప్రదించాడు గోపి. కిడ్నీ మార్పిడి చేయాలని అందుకు అనిల్ అనే ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ తన సిబ్బందికి ఆ కేసును అప్పగించింది. కిడ్నీ ఆర్గాన్ డోనర్లు సిద్ధంగా ఉన్నారని, 27 లక్షల రూపాయల ఖర్చవుతుందని అందుకు అడ్వాన్స్‌గా పది లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు.

Related posts

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

TV4-24X7 News

దుర్గాదేవి మండపాల కమిటీ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు వన్ టౌన్ సీఐ భాస్కర్ రావు

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

TV4-24X7 News

Leave a Comment