Tv424x7
Telangana

పిల్లలపై వీధికుక్కలు దాడి చేస్తున్న పట్టించుకోరా?: హైకోర్టు

హైదరాబాద్ :వీధికుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయి తే, ఉదాశీనంగా వ్యవహరిం చే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. పిల్లలతో పాటు జనాలపై కుక్కల దాడుల నేపథ్యంలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంలో గతంలోనూ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మర ణాలకు కారణమవుతున్న వీధికుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నా రంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వీధికుక్కల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని.. వ్యాక్సినేషన్‌ చేయడం లేదని.. సరైన ఆహారం లేకపోవడంతో జనాలపై దాడులు చేస్తున్నాయని ఓ వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు.గతేడాది ఫిబ్రవరిలో హైద రాబాద్‌ బాగ్‌ అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థిపై దాడి చేయగా.. మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మృతి సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. గత నెలలోనూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బిహార్‌ వలస దంపతుల ఆరేళ్ల కొడుకుపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆసు పత్రిలో కన్నుమూశాడు. ఆయా ఘటనలపై బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి బాధ్యత తీరిందని భావించొద్దని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అనుపమ్‌‌ త్రిపాఠి వర్సెస్‌‌ యూనియన్‌‌ ఆఫ్‌‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే…

Related posts

ఆర్టీసీ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకోవాల్సిందే.. ఎందుకంటే…?

TV4-24X7 News

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

TV4-24X7 News

తెలంగాణలో ఆటో డ్రైవర్ల ధర్నా

TV4-24X7 News

Leave a Comment