విశాఖపట్నం: డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం యూ టర్న్తీసుకుందన్న డెక్కన్ క్రానికల్ వార్తపై టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ విభాగాల నిరసన వ్యక్తం చేశాయి. డెక్కన్ క్రానికల్ కార్యాలయ బోర్డును తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వంపైతప్పుగా రాసిన వార్తను తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యాలయం లోపలకు చొచ్చుకుని వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను డీసీ కార్యాలయం సిబ్బంది అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళనకారుల నిరసననువిరమించుకున్నారు.

previous post
next post