విశాఖపట్నం టౌన్ కొత్తరోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలు నిన్నటితో ముగిసాయి. శుక్రవారం ఉదయం 10:00 గంటలకు ప్రధాన ఉత్సవ అధికారి (సి ఆఫ్ ఓ ) కే. శిరీష , ఆలయ ఈ ఓ టి. రాజగోపాల్ రెడ్డి, విశాఖ జిల్లా తనిఖీదారు బి. వసంత్ కుమార్, ఉత్సవ్ కమిటీ సభ్యులు డీ.హరీష్ , ఎస్. రామకృష్ణ , పి.శ్రీధర్ , జె.పరశురాం , ఆర్.వెంకటేష్ , కె. మణికుమార్ ,కె.ఈశ్వరమ్మ , యు.ఆదిలక్ష్మి , జి.సుశీల , సమక్షంలో హుండీలు తెరిచి లెక్కింపు చేయగా, రథయాత్ర పది రోజులకుగాను హుండీ ఆదాయం ₹19,80,072/- వచ్చినది. వచ్చే గురువారం అనగా 25-07-2024న దేవస్థానం వద్దనే మహా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. శ్రీ స్వామి వారి రథయాత్రకు పూర్తి సహాయ సహకారాలు అందించిన గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ వారికి, పోలీస్ శాఖ వారికి, రోడ్లు భవనాల శాఖ వారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, టెలిఫోన్ శాఖ వారికి, పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు.
