విశాఖపట్నం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టెక్కలి లో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్వగృహంలో ఏ.పి. మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ బోటీ యజమానులు సమావేశం అయ్యి సమస్యలను మంత్రి కి వివరించారు. వీటిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద బకాయిలుగా ఉన్నటువంటి డీజిల్ ఆయిల్ సబ్సిడీ రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షలు విడుదల చేయాలని కోరారు.వివిధ ప్రమాదాలు వల్ల నష్టపోయిన సుమారు 15 మంది ఫిషింగ్ బోటు యజమానులకు నష్టపరిహారం అందజేయాలని, 2023 – 24 సంవత్సరానికి గాను మత్స్యకార భరోసా ఒక్కొక్క మత్స్యకారునికి 20వేల రూపాయలు అందించాలని కోరారు.సాంకేతిక కారణాలను చూపిస్తూ అనర్హులుగా ప్రకటించినటువంటి సుమారు 2000 మంది అర్హులైన వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చి వారికి భరోసా అందజేయాలని కోరారు.మెకనైజ్డ్ ఫిషింగ్ బోటుల డీజిల్ సబ్సిడీ 9 రూపాయల నుంచి 20 రూపాయలు కు పెంచాలని కోరారు.ఫిషింగ్ బోట్లకు ఇన్సూరెన్స్ స్కీము వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని తదితర అంశాలను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలియజేశారు. ఈ సమస్యలపై మంత్రి స్పందిస్తూ సాధ్యమైనంత త్వరగా సమస్యలన్నీ పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చం నాయుడు తెలిపినట్లుగా జానకిరామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుంటు దానయ్య, దూడ పోలయ్య, ఎల్ రవి, వై శ్రీను, వాసుపల్లి బ్రహ్మరాజు, ఆకుల అజార్, సూరాడ అనిల్, చీడిపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post

