విశాఖపట్నం ఉపాధి చూపించాలని కందుల నాగరాజుకు వినతి పత్రం అందజేత వారికి అండగా ఉంటానని భరోసా విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు తన ఔధర్యాన్ని చాటుకున్నారు.కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందుల నాగరాజు హిజ్రాలకు అండగా నిలిచారు.వారికి ఎటువంటి అవసరమైన తాను ముందు ఉంటానని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.స్థానిక 34, 39 వ వార్డులకు చెందిన భారతి,జ్యోతిక, బేబీ, మాధవి, విమల అనే హిజ్రాలకు నెల రోజులకు సరిపడా బియ్యం, కిరాణా సామానులు ఆయన అందజేశారు.ఈ సందర్భంగా వారు భిక్షాటన మాని కష్టపడి బ్రతుకుతాం,మాకు ఉపాధి చూపించండని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని మానవసావే మాధవసేవ అని చెప్పారు.ఇటువంటి వారికి సేవ చేసే అదృష్టం రావడం కూడా సంతోషమని అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి అవసరం వచ్చిన తాను అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్న తన సేవా కార్యక్రమాలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు.భవిష్యత్ లో కూడా తన సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వర, కుమారి, కోదండమ్మ, రాజు, కిషోర్, సరస్వతి, సంధ్య,పుష్ప, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

previous post