విశాఖపట్నం గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా నియమించిన పి.సంపత్ కుమార్ మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ కు జీవీఎంసీ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సంపత్ కుమార్ ని ప్రభుత్వం తాజా బదిలీల్లో గ్రేటర్ విశాఖ కమిషనర్ నియమించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు విశాఖలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి. సంపత్ కుమార్ అన్నారు జీవీఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఎ సమస్య వచ్చిన అందుబాటులొ వుంటానని అని అన్నారు మీడియా ప్రజాప్రతినిధులతో మమేకమై ప్రజలకూ అండగా ఉంటామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఈ సందర్భంగా దన్యవాదాలు తెలిపారు.
