అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కస్టమర్లకు సంస్థ సూచన
రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో మెరుగైన టెలికాం సర్వీసుల కోసం తమ సిమ్ లను 4జీ టెక్నాలజీకి అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా సంస్థ సూచించింది.
ప్రస్తుతం 2జీ/3జీ సిమ్ లు వినియోగిస్తున్నవారికి 4జీ సిమ్ లను ఉచితంగా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసులు
బీఎస్ఎన్ఎల్ సర్వీసు సెంటర్లతో పాటు బీఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీలు/రిటైలర్లు/ఏజెంట్ల వద్ద 4జీ సిమ్ లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
ప్రస్తుతం వినియోగిస్తున్న సిమ్ ఏ టెక్నాలజీ అన్నది. 54040 అనే నెంబర్ కు ” S అని సందేశం పంపడం ద్వారా అది 2జీ/3జీ/4జీ సిమ్మా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంది.
4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన చోట్ల 2జీ/3జీ సిమ్ వినియోగిస్తున్న వారి సేవలకు అంతరాయం ఏర్పడుతోందని, ఈ ఇబ్బందిని తొలగించడానికి ఉచితంగా 4జీ సిమ్ లను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ పీజీఎం వై.రవీంద్రనాథ్ తెలిపారు.
బిఎస్ఎన్ఎల్ మైదుకూరు ఆఫీసు: అన్న క్యాంటీన్ పక్కన ప్రొద్దుటూరు రోడ్ 9491431109