దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్కోల్‌కతాలోని ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా 24 గంటలపాటు వైద్యసేవలు బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఎలాంటి ఓపీలు తీసుకోమని, శస్త్రచికిత్సలు చేయమని తెలిపింది. అయితే ఇందులో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

previous post