హైదరాబాద్:సెప్టెంబర్ 21తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది,గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని తెలిపింది.కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రేషన్ కార్డుల ను ప్రభుత్వం ఆధారంగా చూపుతోంది. అందువల్ల కొత్త రేషన్ కార్డులకోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేష్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇప్పటికీ కూడా రేషన్ కార్డులు రాలేదు. అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలను ఇవాళ విడుదల చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు వాటి ప్రకారం.. అవసరం అయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉంది. ఆరోజు నుంచి దరఖాస్తులు తీసుకునేవిధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో జరిగిన రివ్యూ మీటింగులో సూచించారు. కొత్త రేషన్ కార్డుల సంగతి చూసేందుకు ప్రభుత్వం ఆ మధ్య మంత్రివర్గ సబ్ కమిటీని నియమించింది..

previous post