“పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలుకొత్త పింఛన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పింఛన్ల తనిఖీకి అధికారులు ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. రవాణా శాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటా తెప్పించుకుంటారు. రాష్ట్ర అధికారులు గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అనర్హులకు నోటీసులు పంపించి, లిఖితపూర్వక సమాధానాన్ని తీసుకుంటారు. గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తారు.

previous post
next post