విశాఖపట్నం డ్రగ్స్ వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు, యువతకు ఎంవీపీ పోలీసులు అవగాహన కల్పించారు.నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రాత భాగ్చి ఆదేశాలమేరకు ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో గల హెచ్.బి.కాలనీ తదితర ప్రాంతాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళీ, ఎస్.ఐ. రవివర్మ సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.గంజాయి, గుట్కా, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి, భవిష్యత్లో ఏ విధంగా వారి జీవితాలు పాడవుతాయనే అంశంపై యువతకు సోదాహరణంగా వివరించారు. మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడితే చట్టరీత్యావిధించే శిక్షల గురించి తెలియజేశారు. కాగా మాదక ద్రవ్యాలపట్ల విద్యార్థులు, యువత ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు వారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తూ ఉండాలని, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

previous post