విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 104 కార్యాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ మేరకు సోమవారం ఉదయం అమ్మవారిని ప్రతిష్టించి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. శాంతి రూపాన కనకదుర్గమ్మ అవతారంలో ప్రతిష్టించి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధూప దీప నైవేద్యాలతో ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతుంటాయి. దక్షిణ ప్రజలు, నాయకులు కార్యకర్తలు అలానే విశాఖ, ఉత్తరాంధ్ర, ప్రాంతాలతో పాటు లోక శాంతిని కాంక్షిస్తూ దసరా సంబరాలు పురస్కరించుకొని వాసుపల్లి గణేష్ కుమార్ ప్రతి ఏటా అమ్మవారిని ఆరాధిస్తారు. వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మకు కుంకుమాభిషేకాలు, అన్నదానం, వివిధ సేవా కార్యక్రమాలతో పాటు ఈ నవరాత్రి రోజులు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడ ఉన్నా పిలిస్తే పలికే దైవం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారన్నారు. తమ కార్యాలయ ప్రాంగణంలో అమ్మవారిని ప్రతిష్టించి శరన్నవరాత్రులు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా తిరు ఊరేగింపు ఉత్సవం, అణుపు కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే వైసిపి పెద్దలకు, వైసీపీ శ్రేణులకు, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
