విశాఖపట్నం మత్స్యకారులను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు కానరాని పెంచిన మత్స్యకార భరోసా బుడమేరు వరదల్లో మత్స్యకార సేవలు తీసుకోవాల్సింది. అండగా నిలవాలని జగన్ పిలుపు.జగన్ కి పంచలోహాల శ్రీవారి విగ్రహాన్ని బహుకరించిన వాసుపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం ఉదయం విజయవాడ కార్యాలయంలో భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై మాజీ సీఎంతో వాసుపల్లి గణేష్ కుమార్ కాసేపు చర్చించారు. మత్స్యకారులకు అందాల్సిన భరోసా పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ సూచించారన్నారు. వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ,మత్స్యకారులకు జగన్మోహన్ రెడ్డి ఎంతో అండగా నిలిచారని, అటువంటిది ఎన్నికల ముందు చంద్రబాబు మత్స్యకారులకు 10 వేలు ఇస్తున్న భరోసా 20 వేలు పెంచుతామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా భరోసా విస్మరించిందని వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ధ్వజమెత్తారు. విజయవాడలో వచ్చిన బుడమేరు వరదలు సమయంలో మత్యకార గజ ఈతగాళ్లు సాయం ప్రభుత్వం తీసుకుని వుంటే ప్రజలకు సత్వర సేవలు అందేవన్నారు. వారికి కూడా తాత్కాలిక ఉపాధి దొరికేది అని అభిప్రాయ పడ్డారు. అలాగే, వాలంటీర్లు వున్నా సరే ప్రభుత్వ సాయం ప్రజలకు సకాలంలో చేరి వుండేది అన్నారు. ఇదేనా చంద్ర బాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం అని ఆయన ఎద్దేవా చేశారు.ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేని లోటు కనిపిస్తోందన్నారు. వందరోజుల పాలనకే నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటించారని, అందని కాడికి దోచుకునే విధంగా పది రోజులకు గానూ మూడు పూటల భోజనాలకు ఏకంగా రూ.250 రూపాయలు చొప్పున 368 కోట్ల రూపాయలు, కేవలం అగ్గిపెట్టెలు కొవ్వొత్తుల కోసం రూ. 21 కోట్లు ఖర్చును చూపించి చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే, విశాఖ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తో సమన్వయం చేసుకుంటూ వచ్చే ఏ పి జమ్లి ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్లు అన్ని కైవసం చేసుకోవాలని జగన్ సూచించారు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని త్వరలో ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అండగా నిలవనున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు.

previous post