Tv424x7
Andhrapradesh

శాకాంబరి శ్రీ కనకమహాలక్ష్మిని దర్శించుకున్న వాసుపల్లి

విశాఖపట్నం దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా శాకాంబరీ అవతారంలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారినీ శుక్రవారం ఉదయం దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ నవరాత్రి పర్వదినాన వివిధ రూపాలలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. స్వయంబుగా వెలిసిన బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉండి ఉత్తరాంధ్ర కల్పవల్లిగా వీరాజల్లడం స్థానికుల అదృష్టం అన్నారు. విశాఖను కాపాడుతున్న కనకమహాలక్ష్మీ అమ్మవారి కరుణాకటాక్షం సమస్త జీవరాశులపై ఉండాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు.

Related posts

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

TV4-24X7 News

హోంవర్క్ చేయనందుకు 7 ఏళ్ల బాలుడిని ప్రిన్సిపాల్ కొట్టాడు!!

TV4-24X7 News

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.

TV4-24X7 News

Leave a Comment