విశాఖపట్నం వివేకానంద సంస్థ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్ 75వ పుట్టినరోజు వేడుకలను శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ ను కట్ చేయించి, డాక్టర్ ని సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం జీవీఎంసీ పారిశుద్ధ కార్మికులకు డాక్టర్ చీరలను పంపిణీ చేసి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, మా కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలను సంస్థలోనే నిర్వహిస్తున్నామని, ఆశ్రమ వాసుల మధ్య, ఆశ్రమంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన సంతోషo వ్యక్తం చేశారు, అలాగే నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు సంస్థకు ఉంటాయని, ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బ్రదర్స్ సి ఎం ఎ ఒరేయ్ అన్నయ్య వేసుకోవచ్చు రహీద్ అహ్మద్,సి ఎం ఎ జలీల్ అహ్మద్,ఎండ్ . సాహుల్ మసూద్ ఖాన్ ఉమ్మడి రాష్ట్రాల రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ మక్సుద్ అహ్మద్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్. ముస్తాఫ్ అహ్మద్, సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

previous post
next post