Tv424x7
Andhrapradesh

అనుమతిలేని బాణసంచా స్వాధీనం

విశాఖపట్నం మండలంలో ఏటిగైరంపేట గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమంగా దాచి ఉంచిన లక్షరూపాయలు విలువ చేసే మందు గుండు సామాగ్రిని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతిమ్మ తన సిబ్బంది తో కలిసి దాడి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కేతవరపు జగదీష్ కిరాణా దుకాణం నడుపుతున్నారు. దీంతో పాటు అక్రమంగా మందు గుండు సామాగ్రిని అమ్ముతున్నాట్లు వచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతిమ్మ దాడి లక్షరూపాయలు విలువ చేసే మందు గుండు సామాగ్రిని స్వాధీనం పరుచుకున్నారు. రెవిన్యూ అధికారులు సమక్షంలో పట్టుబడిన మందు గుండు సామాగ్రిని సీజ్ చేసి గదిలో భద్రపరిచారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రేవతిమ్మ మాట్లాడుతూ అనుమతులు లేకుండా వ్యాపారస్తులు మందు గుండు సామాగ్రిని అమ్మకాలు జరిపినట్లు అయితే కేసులు పెడతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజుబాబు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Related posts

దువ్వూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి – పుట్టా సుధాకర్

TV4-24X7 News

ఏపీ మహిళామణులకు శుభవార్త

TV4-24X7 News

కడప జిల్లాలో 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు

TV4-24X7 News

Leave a Comment