విశాఖపట్నం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ జోరువాన లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన 36వ వార్డులో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డ్ లో పలు ప్రాంతాల్లో పర్యటించారు . ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆయా ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ ప్రభుత్వ సిబ్బందితో కలిసి వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా రంగరీజు వీధిలో ప్రజా అవసరాల మేరకు సామాజిక భవనం నిర్మించాలని కోరారు. పోలమ్మ గుడి పక్కన సామాజిక భవనం నిర్మాణం చేపట్టాలని, కొండవాలు ప్రాంతంలో యుజిడి పైపులు మార్చాలని , రంగారీజు సచివాలయం వద్ద సులబ్ కాంప్లెక్స్ తొలగించి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని , అద్దె భవనంలో కొనసాగుతున్న లైబ్రరీ కిశాశ్వత నిర్మాణం చేపట్టి లైబ్రరీని మార్చాలని ఏర్పాటు చేయాలని , రంగరీజు వీధిలో మెట్లు నిర్మించాలని , గుడారిగోతులు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , సత్యనారాయణ గుడి వద్ద వల్ల వాటర్ ట్యాంక్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి ,గేట్లు , సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని, సున్నపు వీధి పోలమాంబ గుడి ఆవరణలో ఆర్చ్ నిర్మించాలని ప్రజలు కోరారు . అదేవిధంగా వార్డులో డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిలైట్లు, పరిశుభ్రత గురించి స్థానిక ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డ్ లో ఏమైనా సమస్యలు వుంటే తెలియపరచాలని కోరారు. ప్రజలు ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేటట్లు కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గం అభివృద్ది కోసం తీవ్ర కృషి చేస్తానని అన్నారు. వర్షంతో సైతం ఎమ్మెల్యే, ప్రభుత్వ సిబ్బంది పర్యటించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు . కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, ప్రభుత్వ సిబ్బంది, సచివాలయసిబ్బంది , సిబ్బంది వివిధ విభాగాల సిబ్బంది, టీడీపీ ,బీజేపీ ,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

previous post