విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ 39వ వార్డు చిలకపేటలో జరుగుతున్న శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.15 వేలు విరాళం అందజేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో శనివారం ఉదయం దక్షిణ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ సమక్షంలో చిలకపేటలో ఏర్పాటుచేసిన దేవి నవరాత్రి నిర్వాహకులకు రూ.15 వేలు నగదును వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు. ముందుగా ఈనెల 25 తేదీన ఆదివారం మధ్యాహ్నం అన్న సమారాధనను వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదగా ప్రారంభించాలని ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చిలకపేట యువకులు, మహిళలు కలిసి నిర్వహిస్తున్న ఈ దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయన్నారు. అమ్మవారి కరుణాకటాక్షం వారందరికీ కలగాలని ఆకాంక్షించారు. వాసుపల్లి గణేష్ కుమార్ అధికారంతో సంబంధం లేకుండా అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు పట్ల కమిటీ సభ్యులు, దక్షిణ నియోజకవర్గ ప్రజలు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆదినారాయణ, ఆదిలక్ష్మి, రాజేష్, ధనరాజు అప్పలరాజు, గంగిరి నూకరాజు, వైసిపి నాయకులు గనగళ్ల రామరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

previous post