తమిళ చిత్ర నిర్మాతలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి కోలీవుడ్లో ఎలాంటి సినిమా షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది.అగ్రహీరోలునటించిన చిత్రాలను థియేటర్ల లో విడుదల చేసిన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

previous post