విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ, విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగను జరుపుకున్నారు. తొలుత పుట్టపై పసుపు, కుంకుమ, పువ్వులు చల్లి విశేష అలంకరణ చేసీ, ఆవుపాలతో అభిషేకం చేసి కుటుంబ సమేతంగా పాలు , నువ్వులతో చేసిన చెలిమీ వేసి, కోడిగుడ్లు వేసి నాగేంద్రుని ఆరాధించారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
