విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త విజయ సాయి రెడ్డిని గురువారం ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిశారు. నూతనంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందజేశారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర రాజకీయ అంశాల పట్ల కాసేపు ముచ్చటించారు. అలాగే వైసిపి పూర్వవైభవం, పార్టీ అభివృద్ధి భవిష్యత్తు కార్యాచరణ వివిధ రాజకీయేతర విషయాలపై మాట్లాడుకున్నారు.

previous post