విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు దర్శించు కున్నారు. అనంతరం ఆలయ రంగి నాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదములను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో భక్తులకు కల్పించే సేవలు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ,నాణ్యతతో లడ్డూను, అన్న ప్రసాదాన్ని అందజేస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

previous post
next post