విశాఖపట్నం పెందుర్తి లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులపై గురువారం నాడు పోలీసులు మెరుపు దాడి చేసి పలువురిని అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద అక్ర మంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్టేషన్ కి తరలించి బెల్టుషాపు నిర్వాహకులు పై కేసు నమోదు చేసారు. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని సీఐ సతీష్ కుమార్ హెచ్చరించారు.
