తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బి.ఆనందసాయి మర్యాదపూర్వకంగా పవన్‌తో కళ్యాణ్ తో భేటీ అయ్యారు. తమకు ఈ పవిత్ర బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడే బృహత్తర బాధ్యతను నియమబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఒక క్లిష్ట సమయంలో టీటీడీ సభ్యులయ్యారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశగా మీ ప్రయాణం సాగాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం పాల్గొన్నారు.

previous post