విశాఖపట్నం విశాఖ దక్షిణం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం వినతి కలిసి పత్రాన్ని సమర్పించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు కార్పొరేటర్, జి.వి.ఎం.సి ఫ్లోర్ లీడర్ అయిన బీసేట్టి వసంత లక్ష్మి. ఈ సంధర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా.. . 33వ వార్డు పరిదిలో వున్న కొల్లు వారి వీధి, సులభ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా వుండటం వలన ఆకాతాయులకు అడ్డగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని కావున, తక్షణమే ఆ స్థలాన్ని యు.పి.హెచ్.సి సెంటర్ గా మార్చవల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు.
