విశాఖపట్నం నేలమ్మ వేప చెట్టు దగ్గర ఉన్న శ్రీ ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను మరియు రెండవ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె . శ్రీలక్ష్మి స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు నియంత్రణ మరియు రహదారులపై ప్రయాణించు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆన్లైన్ యాప్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైబర్ సమస్యల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. మరియు ఎటువంటి సమస్య ఎదురైన వెంటనే పోలీసులు తెలియపరచాలని పోలీసులపై సదుద్దేశం కలిగి ఉండాలని తెలియపరిచినారు పై కార్యక్రమం శ్రీప్రియాంక విద్యోదయ స్కూల్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరిగింది. పై అవగాహన కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post