Tv424x7
Andhrapradesh

ఉచిత బి .పి , షుగర్ వైద్య సేవలు

విశాఖపట్నం స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ నందు ప్రతి నెల రెండవ గురువారం ఉచితంగా బి .పి , షుగర్ వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందిస్తున్నారు. డాక్టర్. సూర్య తేజ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని, వ్యాయామం కూడా తప్పకుండా చేయాలని సూచించారు. చుట్టుపక్కల వారందరూ బి .పి , షుగర్ ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షులు అప్పారావు కోరారు. ఈ వైద్య శిబిరంలో పుండరీకాక్షయ్య, ప్రసాద్ నాయుడు, కమల ప్రియ మొదలైన వైద్య బృందం పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

TV4-24X7 News

రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు

TV4-24X7 News

వియ్యపు చిన్నా ఆద్వర్యం లో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment