అమరావతి :ఏపీలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూఅసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

next post