Tv424x7
Andhrapradesh

అర్ధరాత్రి కేంద్ర బలగాలు అధీనంలోకి నాగార్జున సాగర్

నాగార్జున సాగర్‌ను కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి..నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడారు. కేంద్ర బలగాలు రెండు రాష్ట్రాలను అధీనంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో అర్ధరాత్రికే సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం పంపింది..సాగర్‌కు ఏపీ వైపు ఏపీ బలగాలు, తెలంగాణ వైపు ఆ రాష్ట్ర పోలీస్‌లు పహారా కాస్తున్నారు. ఇప్పటికే కేఆర్ఎంబీ సభ్యులు సాగర్‌కు చేరుకున్నారు. పరిస్థితిపై కేంద్రానికి నివేదిక అందించారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిందని కేఆర్ఎంబీ నివేదికను పంపించింది. ఇండెంట్ లేకుండా, కనీసం లేఖ కూడా రాయకుండా ఏపీ నీటి విడుదల చేసిందని పేర్కొంటూ నివేదిక అందించడం జరిగింది. ముందు ఏపీ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి, ఏప్రిల్‌లో 5 టీఎంసీల చొప్పున నీటి విడుదల చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ పేర్కొంది..

Related posts

మధుమణి ఉచిత చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సల శిబిరం ప్రారంభం

TV4-24X7 News

పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ రాజీనామా

TV4-24X7 News

యువగళం @ 226 రోజులు.. పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి, వసుంధర

TV4-24X7 News

Leave a Comment