విద్యార్థిని రానివ్వని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
తిరిగి బడికి వెళ్లేలా వాసుపల్లి చేసిన కృషి పట్ల కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
విశాఖపట్నం ఓ కార్పొరేట్ పాఠశాల ఫీజు కట్టే స్తోమత లేని ఓ మధ్యతరగతి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి ఆదుకున్నారు. పది రోజులుగా ఫీజు కట్టలేదని స్కూల్ కి ప్రవేశమివ్వని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. 39 వ వార్డు కోట వీధి కి చెందిన షేక్ కరిష్మా కుమారుడు షేక్ రెహన్ భాష నాలుగో తరగతి నారాయణ స్కూల్ అక్కయపాలెంలో చదువుతున్నాడు. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో వాసుపల్లి వద్దకు వచ్చి సమస్య చెప్పి వేడుకున్నారు. స్పందించిన వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 5000 ఆర్థిక సాయం అందించి తిరిగి పాఠశాలలో విద్యను అభ్యసించేలా కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని, ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఆశయంతోనే తాను నడుపుతున్న విద్యాలయాల్లో పేదలకు ఫీజుల్లో రాయితీతో పాటు ఉచిత విద్యను కూడా అందించే విద్యార్థులు తమ వద్ద ఉన్నారని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన అమ్మవడి చదువు మధ్యలో ఆపేసే పేద విద్యార్థులను కూడా మళ్లీ పాఠశాలలకు వెళ్లే విధంగా మలిచిందని వాసుపల్లి గుర్తు చేశారు. కార్పొరేటర్ స్థాయిలో విద్య, వైద్యం పేదలకు అందించే ఏకైక నాయకులు దివంగత రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. తాను చేసే సేవా కార్యక్రమంలో విద్యాదానం ఎంతో సంతృప్తిని ఇస్తుందని వాసుపల్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 వార్డు అధ్యక్షులు సర్వేశ్వర్ రెడ్డి వేణు, దసమంతులు మాణిక్యాలరావు,రామరాజు, వాసు , తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.