Tv424x7
Andhrapradesh

4వేల లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

విశాఖపట్నం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ ఎస్సై పి. రాజారావు, సిబ్బంది బుధవారం నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, రోలుగుంట మండలం సరిహద్దులో నాటు సారా తయారీకి సంబంధించిన స్థావరాలపై నమ్మకమైన సమాచారంతో మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీకి ఉపయోగించే పులుపు సుమారు 4 వేల లీటర్లను ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా నాటు సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం సీఐ రేవతమ్మ మాట్లాడుతూ ఎక్కడైనా నాటుసారా తయారీ గాని అమ్మకాలు గాని, అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.

Related posts

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరికఅ

TV4-24X7 News

చంద్రుడి పై నాసా భారీ ప్లానింగ్ ఏంటో తెలుస్తే షాక్

TV4-24X7 News

ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్

TV4-24X7 News

Leave a Comment