గత ఎన్నికల్లో సుచరిత భర్తకు బాపట్ల ఎంపీ సీటు ఇస్తారని జగన్ ఆఫర్ చేశారు. కానీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సుచరితకు సైతం సొంత నియోజకవర్గం ప్రతిపాడు సీటు దక్కలేదు. ఆమెను తాడికొండ నుంచి పోటీ చేయించారు. దీంతో ఘోర పరాజయం ఎదురైంది. అప్పటినుంచి ఆమె తీవ్ర మనస్థాపంతో గడుపుతున్నారు.. మరోవైపు తాడికొండకు కొత్త వ్యక్తిని ఇన్చార్జిగా జగన్ నియమించారు . అటు ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు కూడా వేరొకరికి అప్పగించారు. దీంతో సుచరిత పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. టిడిపిలో కానీ, జనసేనలో కానీ చేరతారని ప్రచారం నడుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి…

previous post
next post