అనంతపురం : ప్రమాదకరంగా దొంగతనాలకు పాల్పడే చెడ్డీ గ్యాంగ్పై అప్రమత్తంగా ఉండాలని ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సీఐ అశోక్ కుమార్ ప్రజలకు సూచించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఫోటోలను విడుదల చేశారు. చెడ్డీ గ్యాంగ్లో సంచరిస్తున్న దొంగలకు సంబంధించి ఫొటోలను ప్రదర్శించి వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఫోటోని సామాజిక మధ్యమాలలో స్ప్రెడ్ చేయాలని ఎవరికైనా అనుమానం ఉంటే 100 డయల్ కాల్ చేయాలని కోరుచున్నాము

previous post