దిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నియమితులయ్యారు..ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం రేపటితో (డిసెంబర్ 10) ముగియడంతో తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమిచింది. 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్.. పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. ఈ గడువు కూడా డిసెంబర్ 10తో ముగియనుండడంతో కొత్త గవర్నర్‌ను నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్ 11 నుంచి మూడేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ అభ్యసించారు. విద్యుత్, ఆర్థిక, పన్నులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైన్స్ తదితర రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులందించారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో అపారమైన అనుభవం కలిగిన ఆర్థిక, ట్యాక్సేషన్‌లో అపారమైన అనుభం కలిగిన సంజయ్ మల్హోత్రా.. ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు..
