తుపాను ప్రభావం.. ఏపీలో 8 జిల్లాలకు నిధులు మంజూరు..అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు – కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు..సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచించారు. తుపాను కారణంగా విద్యుత్, రవాణాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. శిబిరాల్లో బాధితుల కోసం తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు..తుపాను దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 8 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది..

previous post
next post