Tv424x7
Andhrapradesh

రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఎమ్మెల్యే సుజనా కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి

విజయవాడ.: ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం,హెచ్ బి కాలనీ లోని, 350 మరియు 450 ఎస్ ఎఫ్ టి బ్లాకుల వద్ద,సీ.సీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని హెచ్ బీ కాలనీ 350 మరియు 450 ఎస్.ఎఫ్.టి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు,అసోసియేషన్ సలహాదారు ఎస్పీ శేషగిరిరావు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు.బ్లాక్ నెంబర్ 13 లో 30 కుటుంబాలు నివసిస్తున్నాయని,వాటి మధ్య అంతర్గత రహదారులలో చెట్లు పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు.సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు .పీ.వెంకటేశ్వరరావు, ప్రసాద్, శ్రీనివాస్,మోజెస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

TV4-24X7 News

రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం

TV4-24X7 News

పోలీస్ శాఖలో,మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి పోలీస్ యోగాంధ్ర నిర్వహిస్తున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబు

TV4-24X7 News

Leave a Comment