Tv424x7
Andhrapradesh

ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. ప్రతి మండలంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 42 అంశాలతో అజెండాను రూపొందించారు.వాటిని కేబినెట్ ఆమోదించింది. ఈ రోజు జరిగిన కేబినెట్​సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్ల నిర్వాహణపై సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త అందించారు. ఇప్పటి వరకు నగరాలు పట్టణాలు, జిల్లా కేంద్రాలకే పరిమితం అయిన అన్న క్యాంటీన్లను త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సీఎం.. మంత్రివర్గ సమావేశంలో తెలిపారు.అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, దాతల నుంచి విరాళాలు, వాటి నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక సంక్షేమ కార్యక్రమం. ఈ క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని ప్రభుత్వం 2014-19 లో ప్రారంభించింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పూర్తిగా నిర్వీర్యం చేసింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను తెరిచి పేద ప్రజలకు ఆకలిని తీరుస్తున్న సంగతి తెలిసిందే.

Related posts

సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

TV4-24X7 News

శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ

TV4-24X7 News

కార్తిక పౌర్ణమి మహోత్సవ సందర్భంగా శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment